MNCL: పంచాయితీ ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఆయా వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.