KMM: మధిర మండలం మల్లారంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న డిప్యూటీ సీఎం సతీమణి నందిని విక్రమార్క వాహనాన్ని ఆదివారం పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని డిప్యూటీ సీఎం సతీమణి పేర్కొన్నారు.