NZB: బాల్కొండలో 108 సర్వీసులో పైలట్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాస్, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబానికి తోటి ఉద్యోగులు,జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున రూ.15,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. సంస్థలో ఉద్యోగులు ఒకరికొకరు ఆర్థిక సహాయం చేసుకోవడం జరుగుతోందని, ఎక్స్రేషియా అందించాలని పలుమార్లు నివేదించినట్లు సిబ్బంది తెలిపారు.