SRD: సంగారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఆదివారం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 720 మంది క్రీడాకారులు కిక్ బాక్సింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కిక్ బాక్సింగ్ పోటీలు పోటాపోటీగా జరిగాయి. రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందించారు.