KMR: బిచ్కుంద మండల కేంద్రంలో గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో 26.80 లక్షల రూపాయలతో మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.