BDK: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మణుగూరు,దుమ్ముగూడెంలో 46.3°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లక్ష్మీదేవిపల్లిలో 46.2°C, బూర్గంపహాడ్, చుంచుపల్లి జీఎం ఆఫీస్ 3 ఇన్లైన్లో 46.1°C. పినపాక ఈ బయ్యారంలో 46°C, భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ 45.8°C, అశ్వారావుపేటలో 45.7°Cగా ఉంది. జిల్లాలోని 20 ప్రాంతాల్లో 45°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదై రెడ్ జోన్లో ఉన్నాయి.