MBNR: మిడ్జిల్ మండలంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ కమిటీ సభ్యులు కోరారు. గురువారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని కలిసి వారు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే విగ్రహ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేస్తూ త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.