MHBD: తొర్రూరు మండలంలోని చీకటాయపాలెం గ్రామానికి చెందిన గంపల శంకర్ 1995 నుంచి 2001 వరకు తొర్రూరు ఎంపీపీగా పని చేశారు. చర్లపాలెం ఎంపీటీసీ ఎస్సీ రిజర్వేషన్ కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఆయన దివంగత నేత నెమరుగొమ్ముల యతి రాజారావు ఆశీస్సులతో గెలిచారు. ప్రస్తుతం సర్పంచ్ జనరల్‌కు కేటాయించడంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాడు.