NZB: మొదటి విడత పోలింగ్లో భాగంగా మంగళవారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుంది. మోస్రా మండల కేంద్రంలోని హన్మండ్లు అనే పేదింటి యువకుడు డిగ్రీ చేసి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా సర్పంచ్ బరిలో నిలబడ్డారు. ఓటర్లను ప్రలోభ పెట్టే వ్యవస్థకు చరమగీతం పాడాలని, పేదింటి వారు కూడా రాజకీయంలో సేవ చేయగలరని నిరుపించాలనే తాను పోటీలో నిలబడ్డానన్నారు.