WNP: బూత్ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ కన్వీనర్ అహన్య అన్నారు.పెబ్బేరు పట్టణంలోని బీజేపీ పట్టణ అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో బూత్ కమిటీలను మరింత పటిష్టం చేయాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.