NLG: దామరచర్లలో BRS బలపరిచిన గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సోము నరసమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గ్రామస్తులకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థి సోము నరసమ్మతో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహించి, ఓటర్లను అభ్యర్థించారు. పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు.