NLG: నల్గొండలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో, ఎన్నికల జిల్లా పరిశీలకురాలు కొర్రా లక్ష్మీ సమక్షంలో నిర్వహించారు. 14 మండలాల్లో 2870 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు పూర్తయిందని పేర్కొన్నారు. మొత్తం 7892 మంది ఎన్నికల సిబ్బందిలో పీఓలు 3444, ఓపిఓలు 4448 మందిని నియమించారు.