SDPT: రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో మిల్లర్లు అన్యాయం చేస్తే ఉపేక్షించబోమని నంగునూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దేవులపల్లి యాదగిరి హెచ్చరించారు. తేమ శాతం, తరుగు పేరుతో అదనపు ధాన్యం తీసుకోవడం సరైంది కాదన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కొండంరాజుపల్లి, ఘనపూర్ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన్నరు.