JGL: కోరుట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇవాళ సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. జిల్లాలో మొదటిసారిగా 123 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరి పట్ల సంతోషం వ్యక్తం చేశారు.