NZB: భీమగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని NSUI జిల్లా ఉపాధ్యాకుడు రెహమాన్ ఎంఈవోకు వినతి పత్రం అందజేశారు. హిందీ (S.A), తెలుగు, గణితం, సాంఘీక శాస్త్రాలను ఉర్దూలో బోధించడానికి స్కూల్ అసిస్టెంట్లు లేరని అన్నారు. కిచెన్ సెంటర్ కూడా లేదని అన్నారు. విద్యార్థులు భవిష్య త్తు నష్టపోకుండా ఉపాధ్యాయుల సమస్య తీర్చాలని కోరారు.