MBNR: జిల్లా కేంద్రం బండమీదిపల్లిలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర హాజరై, పిల్లల హక్కులు, బాలల సంక్షేమం, చట్టపరమైన రక్షణలు, న్యాయసేవల గురించి అవగాహన కల్పించారు. స్పెషల్ ఆఫీసర్ కలీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.