MDK: జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరగనున్న సర్పంచ్, వార్డు పదవులకు రెండవ రోజు సోమవారం 1925 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 8 మండలాల్లోని సర్పంచ్ పదవులకు 390 నామినేషన్లు, వార్డు పదవులకు 1535 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇప్పటివరకు మొత్తంగా సర్పంచ్, వార్డు పదవులకు 2360 నామినేషన్లు దాఖలు అయినట్లు వెల్లడించారు.