BDK: టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా-శిశు వికాస కేంద్రంలో 2025-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంపీహెచ్ఐడబ్ల్యూ (మహిళా)/ ఏఎన్ఎం కోర్సు ప్రవేశాలకు మంగళవారం చివరి గడువు అని మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. ఈ ఉచిత శిక్షణలో బీసీ-సీ, ఈ, ముస్లిం మైనారిటీలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంటర్ పూర్తి చేసిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.