NRML: స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఖానాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజురా సత్యం కోరారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు తయారుచేసిన వివిధ ఆహార పదార్థాలు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పిడి సుభాష్ పాల్గొన్నారు.