BDK: టేకులపల్లి మండలం కుంటల్ల గ్రామానికి చెందిన ధనసరి నరసింహారావు నేడు అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య నరసింహారావు పార్దిపదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. అండగా ఉంటానాని హామీ ఇచ్చారు. వారితోపాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.