NZB: నవీపేట్-నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్నందున నవీపేట్ ప్రధాన రైల్వే గేటు రెండు రోజుల పాటు మూసి వేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయనున్నారు. నిజామాబాద్ నుంచి బాసర, భైంసా వైపు వెళ్ళే వాహనదారులు జన్నేపల్లి మీదుగా వెళ్లాలని, బోధన్ వైపు వెళ్లే వారు ఫకీరాబాద్-సాటాపూర్ గేట్ వైపు వెళ్లాలని సూచించారు.