NLG: చిన్నకాపర్తి గ్రామంలో పేదల ఇండ్లు, ఇండ్ల స్థలాలు సకాలంలో పంపిణీ చేయాలంటే సీపీఎం బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి రూపని ఇద్దయ్యను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య లు విజ్ఞప్తి చేశారు. చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఆదివారం జరిగిన ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.