SRCL: పట్టణంలోని రైతు బజార్‌ను ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు బజార్ లోనే విక్రయాలు చేయాలని, రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్లను ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. స్లాటర్ హౌస్ నిర్మించి చికెన్, మటన్, చేపలు విక్రయాలు పూర్తిస్థాయిలో చేసేలా ఏర్పాటు చేయాలన్నారు.