MBNR: యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక, జానపద పోటీల్లో ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు మొదటి బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను మహబూబ్నగర్ కళాశాల ప్రిన్సిపల్ జయప్రద అభినందించారు. విద్యార్థులు మరింత ప్రతిభ కనబరిచి, మరెన్నో బహుమతులు సాధించి కళాశాలకు మంచి పేరు తేవాలన్నారు.