BHPL: మొగుళ్ళపల్లి, ఇస్సిపేట, రంగాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఇవాళ తనిఖీ చేశారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు, తూకపు యంత్రాలు, తేమ శాతం కొలిచే పరికరాలు, రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరగాలని అధికారులను ఆదేశించారు.