NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాకు చెందిన 14 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఈరోజు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నానికి బయలుదేరింది. వైజాగ్ బీచ్, అరకు లోయలను సందర్శించనున్నారు. వీరి కోసం అక్కడ త్రీస్టార్ హోటల్లో వసతి కల్పించారు. తోడుగా ఉపాధ్యాయులతో పాటు మంత్రి తన వ్యక్తిగత సిబ్బందిని పంపించారు.