MNCL: ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో తాండూర్ మండల కేంద్రంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ దేవయ్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి IB చౌరస్తాలో నాకాబందీ నిర్వహించి, ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.