MBNR: గౌరీదేవిపల్లి వద్ద మిషన్ భగీరథ వాల్వ్ నిర్వహణ పనుల కారణంగా వెన్నచేడ్ గ్రామంలో నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామస్థుల ఇబ్బందులను గమనించిన ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి శుక్రవారం ట్యాంకర్ల ద్వారా ఇంటింటికీ తాగునీటిని పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సరఫరా పునరుద్ధరించే వరకు నీటి ఎద్దడి లేకుండా అండగా ఉంటామని వారు గ్రామస్తులు భరోసా ఇచ్చారు.