SRCL: చందుర్తి మండలంలోని మూడపల్లిలో మినీ స్టేడియం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. మొత్తం ఎన్ని ఎకరాలు కేటాయించారని అధికారులను ఆరా తీయగా, మొత్తం ఆరు ఎకరాలు కేటాయించారని అదనపు కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు. అయన వెంట తహసీల్దార్ భూపతి, తదితరులు ఉన్నారు.