NGKL: వంగూర్ మండలంలోని నిజాంబాద్ గ్రామం సమీపంలోని వ్యవసాయ పొలంలో విద్యుత్ ఘాతంలో సోమవారం సాయంత్రం ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన తోట బాలకృష్ణయ్య వ్యవసాయ పొలంలో ఆవు మేత మేస్తుండగా ట్రాన్స్ ఫార్మర్ వద్ద అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలి ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు.