GDWL: తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామంలో ఆదివారం సర్పంచ్ అభ్యర్థులు పొద్దు పొడవగానే గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు వారికి మద్దతుగా తరలివచ్చారు. ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరాహోరిగా చేస్తున్నారు.