MDK: మెదక్ భారతీయ విద్యాలయం విద్యార్థులు 25 ఏళ్లకు అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని ఆనందాలను పంచుకున్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా, వివిధ వృత్తులలో స్థిరపడినప్పటికీ, విద్యార్థులుగా ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. కలిసి చదువుకొని మృతి చెందిన పలువురికి సంతాపం తెలిపారు.