MBNR: మిడ్జిల్ మండలం దోనూరు గ్రామంలో గురువారం జిల్లా పశువైద్యాధికారి మధుసూదన్ గౌడ్ నేతృత్వంలో 54 పాడి పశువులకు చికిత్సలు అందించి, 45 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. రాయితీపై గడ్డి విత్తనాలు, అమ్మతల్లి, గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అందిస్తామని తెలిపారు. మండల పశువైద్యాధికారి శివరాజ్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.