KNR: రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కేశవపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నారు. వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. లైసెన్స్ లేని వారు పదో తరగతి మెమో, పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.