GDWL: గ్రామ పంచాయతీ ఎన్నికలు- 2025 దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సంతోష్ అదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.