JN: బచ్చన్నపేట మండలం చిన్న రామ్చర్ల గ్రామానికి చెందిన నిమ్మ వెంకట్ రెడ్డి భార్య నిమ్మ సత్తెమ్మ (100) శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. నిండు నూరేళ్ల జీవితం గడిపిన ఆమె మృతి పట్ల గ్రామస్థులు, బంధుమిత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సత్తెమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.