KMM: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం అందిన దరఖాస్తుల్లో లోపాలను 15లోగా సరిచేయాలని జిల్లా ఎస్సీ డీడీ జి.జ్యోతి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరులో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు అందాయని తెలిపారు. ఈమేరకు ఆధార్ లింక్, తదితర సమస్యలపై ప్రిన్సిపాళ్లు దృష్టి సారించాలని పేర్కొన్నారు.