JN: దేవరుప్పుల మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు 3వ విడతలో ఈనెల 17న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి బుధవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్లకు మండలంలో 7 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దేవరుప్పుల, సింగరాజుపల్లి, చిన్నమడూరు, మాదాపురం, ధర్మాపురం, సీతారాంపురం, కోలుకొండ గ్రామాల్లో ఏర్పాటు చేశారు.