NZB: బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యా రాజు 20 మందికి కంటి పరీక్షలు చేసి, మోతి బిందు ఉన్నవారిని గుర్తించి శస్త్ర చికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు.