NRPT: దామరగిద్ద మండలం పిడెంపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానంతో పాటు 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎస్సీ రిజర్వేషన్ ఉన్న ఈ స్థానంలో కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మకొల్ల రాములుకు మద్దతునిస్తూ ఇతరులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవం కావడంతో, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాములు హామీ ఇచ్చారు.