SRPT: తుంగతుర్తి మండలంలో మొత్తం 22 ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వాటి ద్వారా ఇప్పటి వరకు మండలంలో 1,39,226 క్వింటాల ధాన్యం కొనుగోలు చేశామని ఏటీఎం అశోక్ కుమార్ సోమవారం తెలిపారు.1585 మంది రైతులు ఖాతాలో 74% డబ్బులు జమ చేశామన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని సూచించారు.