మహబూబ్నగర్ పట్టణానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రేపు రానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సోమవారం జరగబోతున్న కార్యక్రమానికి సంబంధించి పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రితోపాటు జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు.