HNK: విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు అడ్డుగా నిలుస్తున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఫూలే ఆశయ సాధన సమితి(పాస్) రాష్ట్ర అధ్యక్షులు డా.సంగని మల్లేశ్వర్ పిలుపునిచ్చారు. ఇవాళ KU జర్నలిజం విభాగంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తొలి బహుజన ఉద్యమకారుడు సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించారు. వెంటనే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.