MLG: వాజేడు మండలంలోని ప్రసిద్ధ బోగత జలపాతం ఎండల ప్రభావంతో నిర్మానుషంగా మారింది. తెలంగాణ నయాగరాగా పేరొందిన ఈ జలపాతంలో ప్రస్తుతం స్వల్పంగా మాత్రమే నీరు కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి ప్రవాహం తగ్గిపోవడంతో సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని స్థానికులు తెలిపారు.