KNR: జిల్లాలో వీధికుక్కలు, కోతుల బెడదను నివారించాలని, రోజువారీగా మంచినీరు సరఫరా చేయాలని సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. ఆదివారం కోతిరాంపూర్‌లో జరిగిన నగర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో డంపింగ్ యార్డ్ తరలింపు, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.