NLG: పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు పంపినట్లు ఎస్సై రామ్మూర్తి తెలిపారు. దేవరకొండ మండలం రత్యతండాకు చెందిన కోటయ్య, గణేశ్ అనే వ్యక్తులు మద్యం మత్తులో ఈనెల 3న 100కు డయల్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు, దురుసుగా ప్రవర్తించినందుకు గాను అరెస్టు చేసి సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.