BHPL: గోరికొత్తపల్లి మండల వ్యాప్తంగా GP ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని SI దివ్య సూచించారు. అభ్యర్థులు, ప్రత్యర్థులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు. ఓటు కొనుగోలు, అమ్మకం చట్టరీత్యా నేరమని, ఇటువంటి ప్రయత్నాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎన్నికల సజావుగా జరిగేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.