JGL: బీర్పూర్ మండలం కొల్వాయి వద్ద జరిగిన లిఫ్టు ప్రమాదంలో వలస జీవి దుర్మరణం పాలయ్యారు. కొల్వాయి ఆరెపల్లి లిఫ్టులో ఇసుక పూడిక తీయడానికి వచ్చిన ప్రకాశం జిల్లా కలికివాయ బిట్రగుంట గ్రామానికి చెందిన మానికల రామకృష్ణ నిన్న రాత్రి ప్రమాదవశాత్తు లిఫ్ట్ భావిలో పడి మృతి చెందాడు. ఈరోజు మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు.