RR: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హైకోర్ట్ కాలనీలో వరద నీటి పైపులైన్ నిర్మాణ పనుల కోసం లెవెల్స్ & మార్గాన్ని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో కాలనీలో నీటి ముంపు సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం వరద నీటి కాలువ నిర్మాణాన్ని ప్రాధాన్యతతో ప్రారంభిస్తున్నామన్నారు.