సూర్యాపేట: ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వాంకుడోతు వెంకన్న నాయక్ కోరారు. శుక్రవారం ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు జిల్లాలోని పలు పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.